వాట్సప్‌లో మీరే టైపు?
ఒకప్పుడు మనుషులు సంఘాలు పెట్టి సమాజ బాగోగుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో గ్రూపులు కట్టి సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ గ్రూప్‌లో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. మచ్చుకు మేం కొన్ని చెప్తున్నాం. అందులో మీరేటైపో చెక్ చేసుకోండి. మెరుపు వీరులు: వీరెప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటారు. పుసుక్కున ఎవరైనా మెసేజ్ పెట్టడమే ఆలస్యం. వెంటనే ఓ మెరుపు మెరిసినట్టు రిైప్లె ఇచ్చేస్తారు. రోజూవారి పనులైనా కాస్త ఆలస్యంగా చేస్తారేమో కానీ వాట్సప్‌లో మెసేజ్‌లకు మాత్రం అస్సలు ఆలస్యం చేయరు. ఇలాంటి వారి వల్లే వాట్సప్ గ్రూపులు పదికాలాల పాటు ఆక్టివ్‌గా నడుస్తాయి. నిశాచరులు: పగలంతా ఆఫీస్ పనుల్లో, వేరే పనుల్లో బిజీగా ఉండి రాత్రి ఇంటికి రాగానే భోజనం చేసేసి ఆన్‌లైన్‌లోకి వస్తారు. అందరూ తినేసి ఇక పడుకుందామనుకునే సమయంలో హాయ్ అంటూ పలకరిస్తారు. ఎంతకూ ఓ పట్టాన వదలరు. అప్పుడెప్పుడు పొద్దున్నే గుడ్‌మార్నింగ్ పెట్టిన మెసేజ్‌కి అర్ధరాత్రి రిైప్లె ఇచ్చే టైప్ అన్నమాట వీళ్లు. నిద్ర ముంచుకొస్తుంటే కుళ్లు పరాచికాలు ఆడతారు. ఏజెంట్ 007: గ్రూప్‌లో అందరి మెసేజ్‌లు చూస్తుంటా...