Monday, 15 August 2016

70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు

ముందుగా అందరికి  70వ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనకు తెలుసు ఎందరో మహానుభావుల త్యాగఫలమే మన ఈ స్వాతంత్య్రదినోత్సవం.సుమారు 200 సంవత్సరాలపాటు మన భారత దేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు.
వారి పరిపాలనలో ప్రజలందరు ఎన్నో బాధలు పడ్డారు. ఆంగ్లేయులు మన ప్రజల్ని రకరకాల పన్నులపేరుతో ప్రజలందర్నీ ఎంతో హింసించేవారు,అలాంటి సమయంలో భాల గంగాధర్ తిలక్,అల్లూరి సితారామరాజు,నేతాజి సుభాష్ చంద్రభోస్,భగత్ సింగ్,మహాత్మా గాంధీ లాంటి ఎందరో మరెందరో మహానుభావులు వారి వారి మార్గాల్లో  పోరాడి బ్రిటీష్ వారిని 1947 ఆగష్టు 14వ తేది అర్దరాత్రి మన దేశం నుండి వెల్లగొట్టారు. 




అప్పటినుండి మనదేశాన్ని మనకు మనమే పాలించుకుంటున్నాం. ఇక ప్రస్తుత పరిస్థితికి వస్తే నా ద్రుష్టిలో మన దేశానికి ఇంకా స్వాతంత్రం రాలేదు. గాంధీ గారు చెప్పినట్టు అర్ధరాత్రి ఆడవాల్లు తిరిగితే స్వాతంత్రం వస్తుందో లేదో తెలియదుకానీ,ఎప్పుడైతే మన దేశంలో పేదరిక నిర్మూలన జరిగి ప్రజలందరూ మూడుపూటలా ఆరోగ్యమైన భోజనం తింటూ సుఖంగా గడుపుతారో, ఎప్పుడైతే దేశంలో నిరుద్యోగులు లేకుండా ఉంటారో,ఎప్పుడైతే దేశంలో రాజకీయనాయకులు నిస్వార్థంగా పనిచేస్తారో  అప్పుడే నిజమైన స్వాతంత్య్రం వస్తుంది. అందరూ చెప్పినట్టు మన దేశం పేదదేశం కాదండీ, కోహినూర్ లాంటి వజ్రాలు బ్రిటీష్ వారు దోచుకున్నప్పటికీ మన దేశం ఇంక ధనిక దేశమే. దేశంలో అందరూ సక్రమంగా సంపాదించి ,సరిగ్గా పన్ను కడితే మన దేశంలో డబ్బుకు కొదవుండదు. 

So ఎప్పుడైతే మన దేశంలో ఉన్న లెక్కలేనంత నల్లధనం బయటికి వస్తుందో,అప్పుడే నాకు నిజమైన స్వాతంత్య్రం వస్తుంది.

****************************     జై హింధ్  ***********************************
    

0 comments:

Post a Comment