Wednesday, 17 August 2016

వాట్సప్‌లో మీరే టైపు?

ఒకప్పుడు మనుషులు సంఘాలు పెట్టి సమాజ బాగోగుల కోసం, సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేవారు. ఇప్పుడు రోజులు మారాయి. వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో గ్రూపులు కట్టి సమాచారాన్ని షేర్ చేసుకుంటున్నారు. ఈ గ్రూప్‌లో ఒక్కొక్కరూ ఒక్కోలా ఉంటారు. మచ్చుకు మేం కొన్ని చెప్తున్నాం. అందులో మీరేటైపో చెక్ చేసుకోండి.
people types that are using whatsapp
మెరుపు వీరులు: వీరెప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటారు. పుసుక్కున ఎవరైనా మెసేజ్ పెట్టడమే ఆలస్యం. వెంటనే ఓ మెరుపు మెరిసినట్టు రిైప్లె ఇచ్చేస్తారు. రోజూవారి పనులైనా కాస్త ఆలస్యంగా చేస్తారేమో కానీ వాట్సప్‌లో మెసేజ్‌లకు మాత్రం అస్సలు ఆలస్యం చేయరు. ఇలాంటి వారి వల్లే వాట్సప్ గ్రూపులు పదికాలాల పాటు ఆక్టివ్‌గా నడుస్తాయి.
నిశాచరులు: పగలంతా ఆఫీస్ పనుల్లో, వేరే పనుల్లో బిజీగా ఉండి రాత్రి ఇంటికి రాగానే భోజనం చేసేసి ఆన్‌లైన్‌లోకి వస్తారు. అందరూ తినేసి ఇక పడుకుందామనుకునే సమయంలో హాయ్ అంటూ పలకరిస్తారు. ఎంతకూ ఓ పట్టాన వదలరు. అప్పుడెప్పుడు పొద్దున్నే గుడ్‌మార్నింగ్ పెట్టిన మెసేజ్‌కి అర్ధరాత్రి రిైప్లె ఇచ్చే టైప్ అన్నమాట వీళ్లు. నిద్ర ముంచుకొస్తుంటే కుళ్లు పరాచికాలు ఆడతారు.
ఏజెంట్ 007: గ్రూప్‌లో అందరి మెసేజ్‌లు చూస్తుంటారు. ప్రతీ మెసేజ్ చదువుంటారు. ఎవరు ఎలాంటి పోస్టులు పెడుతున్నారు? ఎవరి మెంటాలిటీ ఏంటి? ఎవరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎవరు ఎవరి మెసేజ్‌లకు రిైప్లె ఇస్తున్నారు? వంటి విషయాలు గమనిస్తూ ఉంటారు. కానీ దేనికీ స్పందించరు. గ్రూప్‌లో ఉంటారు. కానీ వీరొకరున్నట్టు గ్రూప్‌లో ఎవరికీ తెలియదు.

అమాయక చక్రవర్తులు: వీరికి చోరకళలో పెద్దగా ఎక్స్‌పీరియన్స్ ఉండదు. పైన చెప్పిన రకం వారికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటారు వీరు. పరీక్షలో పక్కోడి పేపర్ చూసి వాడి పేరు, సంతకం, హాల్‌టికెట్ నెంబర్ కూడా అదే వేసేంత అమాయకత్వం అన్నమాట. ఒక గ్రూపులో కొట్టేసిన మెసేజ్ తిరిగి అదే గ్రూప్‌లో కనీసం ఎడిట్ కూడా చేయకుండా పెట్టి దొరికిపోతుంటారు.

వ్యాస మహర్షులు: హెడ్డింగ్ చూసి వీరేదో మహానుభావులు అనుకుంటే పొరపాటే. వీరు పంపే మెసేజ్ వ్యాసంలా ఉంటుంది. అందుకే వీరిని వ్యాస మహర్షులు అన్నాం. వీరు పంపే మెసేజ్ ఎంతసేపు స్క్రోల్ చేసినా దాని అంతు ఎక్కడుందో మాత్రం తెలియదు. చివరికి చిరాకేసి డిలీట్ చేసేలా ఉంటుందా మెసేజ్. వీరి నెంబర్ నుంచి మెసేజ్ వచ్చిదంటేనే చూడకముందే డిలీట్ చేసే రేంజ్‌కెళ్లిపోతుందన్నమాట.
మీడియా ఇక్కడ : ఫొటోలు, పేపర్ క్లిప్పింగ్స్, వీడియో వంటి మీడియా ఫైల్స్ మాత్రమే పంపుతారు. టెక్ట్స్ మెసేజ్‌ల జోలికే రారు. అసలు అది మా జోనర్ కాదన్నట్టు వ్యవహరిస్తారు. గంటకోసారి గడియారం ముళ్లు కలిసినట్టుగా ఎప్పుడో ఓసారి వచ్చి గంపల కొద్ది వీడియోలు, ఫొటోలు కుమ్మరించి వెళ్లిపోతారు. వాళ్లా వీడియో, ఫొటో చూశారా? లేదా? అనే విషయాలు వీరికి పట్టవు.
పిండుకునే టైప్: వీళ్లు బోర్లో బిందెడు నీళ్లు పోసి డ్రమ్ము నీళ్లు పిండుకునే టైప్ అన్నమాట. గ్రూప్‌లో ఎవరైనా ఏదైనా మెసేజ్, ఫొటో పెట్టారంటే చాలు... చటుక్కున దాన్ని కబ్జా చేసేస్తారు. అంతేకాదు... దాన్ని తమ అకౌంట్‌లో వేసుకునేందుకు ఫేస్‌బుక్‌లో, వేరే వాట్సప్ గ్రూప్‌లో తమ పేరుతో తోసేస్తారు. కనీసం పంపినోడి పేరు, వివరాలు, వాడి వాసన కూడా తగలకుండా జాగ్రత్త పడతారు.

Source: telugumessenger
    

0 comments:

Post a Comment