"అమ్మ" ఈ భూమ్మీద అన్నిటికన్నా తీయనైన పదం. అమ్మాయి ప్రేమలో అబద్దం ఉంటుందేమో కాని,అమ్మ ప్రేమలో అబద్దం ఉండదు. ఏమీ ఆశించకుండా ప్రేమించేది ఒక్క అమ్మ మాత్రమే. ఒక చిన్నఉదాహరణ చూడండి.మీరు చిన్నప్పుడు వర్షంలో తడిసి వచ్చారనుకోండి.చెల్లి అంటుంది కొంచం ఆగి రావచ్చు కదరా అని,నాన్న అంటారు వర్షం వచ్చేముందే రావచ్చు కదా అని,కాని అమ్మ అంటుంది ఈ పాడు వర్షం ఇప్పుడే రావాలా నా కొడుకు ఇంటికి వచ్చిన తరువాత రావొచ్చు కదా అంటుంది అది అమ్మ ప్రెమంటే.
మనల్ని చిన్నప్పటి నుండి కంటికి రెప్పలా కాపాడుతుంది.మనకు గాయం అయితే తను బాధపడుతుంది,మన సంతొషమే తన సంతొషం అనుకుంటుంది.ఈ ప్రపంచంలో ఏ మనిషైన,ఏ జంతువైన తల్లిప్రేమ పొందాల్సిందే.నాకు ఇంకా గుర్తున్నాయి అమ్మచేతి గొరుముద్దలు,నాకు ఆకాషంలో చంద్రున్ని చూపిస్తూ తినిపించిన గొరుముద్దలు.నాకు తెలిసి అమ్మకన్నా గొప్పది ఈ ప్రపంచంలో ఏదీ లేదూ.చిన్నప్పుడు మనం ముద్దుముద్దుగా మాట్లడుతుంటే తను ఎంతో సంతోషిస్తుంది.ఈ ప్రపంచంలో ఎంత వెదవ అయినా తల్లికి మాత్రం మంచివాడిలాగే కనిపిస్తాడు.కనిపించని ఆ దేవుడ్ని పూజిస్తే పుణ్యం వస్తుందో రాదో నాకు తెలియదుకాని,అమ్మని పూజిస్తే మాత్రం తప్పకుండా వస్తుందని నా నమ్మకం.మనల్నీ ఎప్పుడూ సప్పోర్ట్ చేసేది కూడ అమ్మే.
"Happy mother's day". Thank you అమ్మ for your support.
0 comments:
Post a Comment