బాహుబలి’లో దేవసేనగా అనుష్క ఫస్ట్‌లుక్

ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రధారులుగా యస్‌.యస్‌. రాజమౌళి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ‘బాహుబలి’. ఈ చిత్రంలోని పాత్రధారులను మే 1 నుంచి మే 31 వరకు చిత్రానికి సంబంధించి పోస్టర్లను విడుదల చేస్తామని రాజమౌళి తెలిపారు. దానిలో భాగంగానే ఇప్పటికే రెండు పోస్టర్లను రిలీజ్ చేసిన రాజమౌళి తాజాగా....మరో పోస్టర్‌ను విడుదల చేశారు. ‘బాహుబలి’లో దేవసేనగా అనుష్క ఫస్ట్‌లుక్ రిలీజ్ చేశారు. మే 31న ట్రైలర్‌ ఆవిష్కరణ జరిగేలోగా మరికొన్ని కేరక్టర్ల పోస్టర్లను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు. రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ చిత్ర మొదటి భాగానికి ‘బాహుబలి - ద బిగినింగ్‌’ అనే టైటిల్‌ నిర్ణయించారు. కె. రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జూలై రెండో వారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
(source www.Andhrajyothy.com)

Comments

Popular posts from this blog

Oxford Advanced Learner's Dictionary... Full version for Android

Best 6 strategic mobile app trends for 2017

iPhone7: Three new handsets will be launched this year